అవంతి శ్రీనివాస్ కి టచ్ లో టిడిపి నాయకులు..

avathi-12-.jpg

గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్న ఆయన ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి, ప్రస్తుతం టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే తన అనుచరులతో చర్చించినట్లు సమాచారం. అయితే వ్యక్తిగత కారణాలతోనే అవంతి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అవంతి శ్రీనివాస్ కి టిడిపి నాయకులు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. రాజీనామా ప్రకటన వెంటనే ఉత్తరాంధ్ర కీలక నేతలు అవంతి శ్రీనివాస్ కి ఫోన్లు చేసినట్లుగా సమాచారం. అయితే తనకి ఎక్కడ గౌరవం లభిస్తే అక్కడే ఉంటానని అవంతి చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే అవంతి సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపి కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Share this post

scroll to top