అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం, పెద్దతిప్పసముద్రం మండలంలో ప్రతీకార దాడులు మొదలయ్యాయి. బుధవారం రాత్రి మండలంలోని పులికల్లుకు చెందిన ఎం.లక్ష్మీనారాయణ అనే వైఎస్ఆర్సిపి కార్యకర్తపై టిడిపి నాయకులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. దాడిలో వైకాపా కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గత కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న పీటీఎం మండలంలో నిన్న జరిగిన ఘటనతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఈ సందర్బంగా ప్రజలు మాట్లాడుతూ ప్రతీకార దాడులతో గ్రామాల్లో పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయో ఆందోళనగా ఉందన్నారు. ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, మరోసారి ఇటువంటి దాడులు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రజలు సంయమనం పాటించాలని, పార్టీల కోసం వ్యక్తిగత పగలు పెంచుకోవడం సబబు కాదని హితవు పలికారు.
వైఎస్ఆర్సిపి కార్యకర్తపై టిడిపి నాయకులు దాడి..
