అదిరిపోయిన ‘మిరాయ్’ టీజర్..

teja-28.jpg

హనుమాన్’ లాంటి భారీ హిట్ అందుకున్నా తేజ సజ్జ మళ్ళీ అదే తరహాలో ‘మిరాయ్’ వంటి భారీ పాన్ వరల్డ్ చిత్రంతో వస్తున్నాడు. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ షూటింగ్‌కి, కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటున్నప్పటికీ ఆ మధ్య వచ్చిన గ్లింప్స్ అందరికీ షాకిచ్చింది. ఒక్కో పోస్టర్ మాత్రం మూవీ అంచనాలు బాగా పెంచేసింది. ఇక ఈ రోజె అవైటెడ్ టీజర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఈ టీజర్ ఎలా ఉంది అంటే. ఊహించని రీతిలో ఉందని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉంది. ఇండియన్ సినిమా దగ్గర ఎన్నో భారీ సినిమాలు వస్తున్నాయి.

కానీ కంటెంట్ ఉంటే దానికి తగ్గట్టుగా కావాల్సిన ప్రామిసింగ్ విజువల్స్ కూడా చాలా మెయిన్‌. ఇక ‘మిరాయ్’ దానికి అతీతంగా ఉందని చెప్పడంలో సందేహం లేదు. స్టన్నింగ్ విజువల్ ఎఫెక్ట్స్‌తో ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ వచ్చింది. ముఖ్యంగా మంచు మనోజ్ అదరకొట్టాడు. సాహస సన్నివేశాల్లో తేజ ఎక్కడా కూడా అసలు కాంప్రమైజ్ అయినట్టే కనిపించడం లేదు. అలాగే ఇండియన్ సినిమాకు ఒక సరికొత్త అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాగా ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇక లాస్ట్ షాట్‌లో రాముని రాకపై చూపించిన విజువల్ వర్ణనాతీతం మొత్తానికి ‘మిరాయ్’ తెలుగు ఇండస్ట్రీని మరో మెట్టు ఎక్కించేలా కనిపిస్తుంది.

Share this post

scroll to top