2024 తెలంగాణ పూర్తిస్థాయి బడ్జెట్‌..

batti-25.jpg

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఇవాళ అసెంబ్లీ ప్రవేశ పెట్టింది. ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2024 సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఫిబ్రవరిలోనే బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉన్నప్పటికీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తీసుకొచ్చారు. పూర్తిస్థాయిలో ఆర్థిక వనరులపై పట్టు లేదని, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల వివరాలు తెలియాల్సి ఉన్నందున అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ మధ్యనే కేంద్రం కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులను బేస్ చేసుకొని ఇప్పుడు బడ్జెట్‌ను రూపకల్పన చేశారు. మొత్తం రూ.2,91,159 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ‘ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే కలలు సాకారమవుతాయని సుదీర్ఘ కాలం ఉద్యమించారు. వారి ఆవేదన గుర్తించి యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక రాష్టాన్ని ఇచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత దశాబ్ధి కాలంలో పురోభివవృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదు. గత పాలకులు అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమయ్యారు. ప్రజల సంక్షేమాన్ని కూడా పట్టించుకోలేదు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న 77 వేల కోట్ల రూపాయల అప్పు… ఆరు లక్ష 71వేల 750 కోట్లకు చేరింది.’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 

Share this post

scroll to top