తెలంగాణ బీజేపీ పగ్గాలు ఎవరికి..? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకపోతోంది. ఢిల్లీలో రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై కసరత్తు జరుగుతోంది. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ నెలఖరుకే కొత్త సారథికి పగ్గాలు అప్పగించే ఛాన్స్ కనిపిస్తోంది. అందరికంటే ముందు రేసులో ఈటల రాజేందర్ ఉన్నా.. ఆయనకు రఘునందన్, ధర్మపురి అర్వింద్ నుంచి గట్టి పోటీయే ఉంది. ఈ ముగ్గురిలో ఒకరికి ఛాన్స్ దక్కుతుందని ప్రచారం జరుగుతున్న టైమ్‌లో.. ఎవరికివారు తమ బలాబలాలను హైకమాండ్ ముందు ఉంచుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ తన ఉనికిని క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. ఎన్నికలు ఏవైనా కమల వికాసం ఖాయం అనేలా తన కేడర్ ను బలపరుచుకుంది. ఈ క్రమంలోనే రాష్ట్రానికి ఒక బలమైన దిశానిర్దేశం చేసే నాయకుడు ఉండాలని భావిస్తోంది. అయితే కొత్త జాతీయ అధ్యక్షుడి నియామకం ఆలస్యమవుతుండడంతో.. పలు రాష్ట్రాల్లో అధ్యక్షుల మార్పుపై హైకమాండ్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
తెలంగాణ బీజేపీ రథసారధి ఎంపికపై కసరత్తు.. వీరిలో ఒకరికి అవకాశం..
