సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన నేడు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది మంత్రివర్గం. హైడ్రాకి చట్టబద్ధత ద్వారా ఆర్డినెన్స్ తీసుకువచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల జారీ, వరద నష్టం, పరిహారం చెల్లింపుపై చర్చించనుంది. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు, రీజినల్ రింగ్ రోడ్డు భూ సేకరణపై చర్చ జరగనుంది. అటు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి, కోఠిలోని మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ, హ్యాండ్లూమ్ వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లను పెట్టడానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది.
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం..
