రుణమాఫీపై మరో బిగ్ అప్డేట్.. 

ravanth-17.jpg

రుణమాఫీకి అన్ని అర్హతలు ఉండి మాఫీ కాని రైతులకు న్యాయం చేసేందుకు సరికొత్త ప్లాన్ రచించారు. ఆధార్‌ కార్డుల్లో తప్పులుండటం, బ్యాంకు ఆధార్‌ వివరాల్లో తేడాలుండటం, పట్టాదారు పాస్‌ పుస్తకం లేకపోవటం లాంటి కారణాలతో కొందరు రైతులకు రుణమాఫీ అమలు కాలేదు. దీంతో ఆ రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారికి శుభవార్త చెబుతూ మీకు టెన్షన్ అవసరం లేదని అన్నారు సీఎం. అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ జరిగితీరుతుందని సీఎం చెప్పారు. ఈ మేరకు గత జూలై 15న జారీచేసిన జీవో నంబరు 567కు అనుబంధంగా రాష్ట్ర వ్యవసాయశాఖ శుక్రవారం ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. రుణమాఫీ కానీ రైతుల కోసం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని పేర్కొంది.

ఈ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టే బాధ్యతను మండల వ్యవసాయ అధికారులకు అప్పగిస్తూ వ్యవసాయశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ గోపి ఆదేశాలు జారీ చేశారు. ఏవోలు రైతుల ఇంటింటికి తిరిగి ఫిర్యాదులు స్వీకరించాలని, రుణమాఫీ అమలుకాని రైతులపై శ్రద్ద పెట్టి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. ఆధార్‌ కార్డు తప్పుగా ఉంటే.. రైతుల వద్దకు వెళ్లి ఆధార్‌ కాపీ మళ్లీ తీసుకోవాలని, అదేవిధంగా ఓటరు కార్డు, వాహన లైసెన్సు, రైతు రేషన్‌ కార్డు లాంటి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలను రైతుల నుంచి తీసుకొని పోర్టల్ లో సబ్మిట్ చేయాలని తెలిపారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగొద్దని అన్నారు. ఈ స్టేట్‌మెంట్‌తో రుణమాఫీ కాని రైతుల్లో సంబరాలు చేసుకుంటున్నారు.

Share this post

scroll to top