బెట్టింగ్ యాప్స్ కేసులపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం..

ravanth-reddy-26-.jpg

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసులపై సరికొత్త అడుగు వేయబోతోంది. బెట్టింగ్ యాప్స్ కేసులను సిఐడి కి బదిలీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో బెట్టింగ్ యాప్స్ కేసులను సిఐడి మాత్రమే విచారణ చేయబోతోంది. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో నమోదు అవుతున్న కేసులు అన్నిటిని సిఐడి కి అప్పగించబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

ఈ కేసులను సిఐడి మాత్రమే లోతుగా దర్యాప్తు చేయగలరని భావించిన రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుందని సమాచారం అందుతోంది. భవిష్యత్తులో ఇలాంటి కేసులు నమోదు కాకుండా కూడా చూడాలని సిఐడి కి దిశా నిర్దేశం చేసారని తెలుస్తోంది. హైదరాబాదులో 11 మంది బెట్టింగ్ యాప్స్ కార్యకర్తలపై కూడా కేసులు నమోదు అయ్యాయి. సైబరాబాద్ లో బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసిన 25 మంది సెలబ్రిటీలపై కూడా కేసులు పెట్టారు.

Share this post

scroll to top