తెలంగాణ రైతులకు ప్రభుత్వం షాక్..

thummala-19.jpg

తెలంగాణ రైతులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీ సన్న ధాన్యం పండించిన రైతుకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వమని స్పష్టం చేశారు.

రూ.25 వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పంట వేయని భూములకు ఇచ్చిందన్నారు. రైతు భరోసా 7500 క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఇస్తామన్నారు. మార్పులకు అనుగుణంగా రైతులను మారుస్తామని క్లారిటీ ఇచ్చారు. ఆర్థిక వెసులుబాటు లేకపోయినా ముఖ్యమంత్రి రుణమాఫీ అంశాన్ని తన భుజాన వేసుకున్నారు. గతంలో వైఎస్సార్ హయాంలో 70 వేల కోట్ల రుణమాఫీ చేశారని తెలిపారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామన్నారు.

Share this post

scroll to top