మందుబాబులకు బ్యాడ్​ న్యూస్​​..

liqur-17.jpg

తెలంగాణలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్. ఇటీవలే బీర్ల ధరలు పెరగ్గా తాజాగా ఇతర లిక్కర్ ధరలు కూడా పెంచేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అయితే బడుగు వర్గాలు ఎక్కువగా సేవించే చిఫ్‌ లిక్కర్‌ ధరలో ఎలాంటి సవరణ ఉండదని సమాచారం. ఎక్కువ ధరలు కలిగిన లిక్కర్‌ పైనే కాస్త పెంపు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై మదింపు జరుగుతుంది. ఎంఆర్పీ ధర ఆధారంగా రేట్ల పెంపు ఉంటుంది. బాటిల్ రేటు రూ.500 కంటే ఎక్కువ ఉన్న లిక్కర్‌పైన కనీసం 10 శాతం పెంచాలన్నది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. రెండు, మూడు రకాల ధరల పెంపు ప్రపోజల్స్ అధికారులు ప్రభుత్వం ముందు ఉంచనున్నారు. ఆయా విధానాల్లో ఎంత ఆదాయం సమకూరుతుందో కూడా రిప్రజెంటేషన్ ఇస్తారు. వాటిపై ప్రభుత్వం రివ్యూ చేసి ఫైనల్‌గా నిర్ణయం తీసుకుంటుంది. లిక్కర్‌పై రేట్ల పెంపు ద్వారా ప్రభుత్వ ఖజానాకి ఏడాదికి రూ. 2000 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుంది అన్నది అధికారుల అంచనా.

Share this post

scroll to top