సంక్రాంతికి రైతు భరోసా నిధుల విడుదలకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో ఇవాళ అసెంబ్లీలో రైతు భరోసా అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఆతరువాత సీఎం రేవంత్ ఓ ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. రైతు భరోసా నిధులను వచ్చే సంక్రాంతి నాటికి అన్నదాతాల ఖాతాలో జమచేస్తామని ముఖ్యమంంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో అసెంబ్లీలో చర్చించి దీనిపై ఓ ప్రకటన విడుదల చేయనున్నారు. ఉద్యోగులు, టాక్స్ పేయర్లను అనర్హులుగా ప్రకటించాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
తొలి విడుతగా ఎకరానికి రూ.7500 రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఎకరానికి 15000 వేల రూపాయాల పెట్టుబడి సహాయం కింద రైతులకు అందజేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తొలివిడుతగా రూ.7500 భరోసా నిధులు విడుదల సిద్దమైంది. ఇప్పటి వరకు రైతుల భరోసా నిధిలు విడుల చేయకపోవడంతో ప్రతి పక్షాలు విమర్శిస్తున్నాయి. దీనికి చెక్ పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈరోజు రేవంత్ రెడ్డి చేసే ప్రకటన పైనే అందరిలోనూ ఆశక్తి నెలకొంది.