తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ నిర్వహణకు సంబంధించి ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. భూముల క్రమబద్ధీకరణ కోసం గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ధరణి పోర్టల్‌ను వినియోగించారు. అయితే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్‌కు బదులుగా కొత్త ఆర్వోఆరు చట్టం తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్ నిర్వహణను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ కి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల పాటు ధరణి పోర్టల్‌ను నిర్వహించేలా సదరు సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే పనితీరు బాగుంటే మరో 2 ఏళ్లపాటు కాంట్రాక్ట్‌ను పొడిగిస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ ఒప్పందంలో పేర్కొంది.
తెలంగాణ సర్కార్ ధరణి పోర్టల్ పై షాకింగ్ నిర్ణయం..
