కేటీఆర్ తో పాటు లాయర్లు కూర్చోవడానికి వీల్లేదు..

ktr-08-1.jpg

ఏసీబీ విచారణకు తనతో పాటు లాయర్లను కూడా అనుమతించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే కేటీఆర్ తో పాటు లాయర్లు కూర్చోవడానికి వీల్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఏసీబీ ఆఫీస్ లో కేటీఆర్ కు దూరంగా లాయర్లు ఉండేందుకు అనుమతిస్తామని తెలిపింది. ఇందుకోసం ముగ్గురు లాయర్ల పేర్లు ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి నిర్ణయాన్ని సాయంత్రం 4 గంటలకు ప్రకటిస్తామని న్యాయస్థానం వెల్లడించింది. 

Share this post

scroll to top