హైకోర్టులో మోహన్‌బాబుకు చుక్కెదురు..

mohan-babu-19.jpg

హైకోర్టులో మోహన్‌బాబుకు చుక్కెదురైంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్‌పై దాడి కేసులో మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని మోహన్‌బాబు న్యాయవాది కోర్టును కోరారు. కాగా కౌంటర్‌ దాఖలు చేశాకే తీర్పు ఇస్తామని హైకోర్టు తెలిపింది అలాగే తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. టీవీ9 రిపోర్ట్ పై దాడి చేసిన ఘటనలో మోహన్ బాబు పై కేసు నమోదైన విషయం తెలిసిందే. అంతే కాదు ఆయన గన్స్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Share this post

scroll to top