గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లపై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ మేరకు అదనపు షోలు, షో టైమింగ్స్, ప్రేక్షకుల రద్దీపై రేపు ఆదేశాలు ఇస్తామని కోర్టు స్పష్టం చేసింది. టికెట్ ధరల పెంపు అంశాన్ని పుష్ప 2తో కేసుతోపాటు విచారణ జరుపుతామని కోర్టు పేర్కొంది. ఇటీవల పుష్ప 2 ది రూల్ సినిమా రిలీజ్ సమయంలో తొక్కిసలాట ఘటన నేపథ్‌యంలో ‘ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు. అదనపు షోలు ఉండవు. టిక్కెట్ ధరలు పెంచబోం’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారని తెలిసిందే. అయితే ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రకటించి నెల రోజులు కూడా కాకముందే ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటూ రామ్‌చరణ్ హీరోగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా బెనిఫిట్ షోలకు, అదనపు షోలకు, టిక్కెట్ ధరల పెంపునకు అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.