కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి , బండి సంజయ్ కుమార్ లు బుధవారం హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా వారికి తెలంగాణ బీజేపీ నేతలు భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రమంత్రులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా వారు తెలంగాణకు వస్తున్నారు. బుధవారం బేగంపేట్ విమానాశ్రయానికి వస్తున్న వారికి స్వాగతం పలికి అక్కడి నుంచి నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళ్లనున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఇద్దరికీ సన్మానం చేస్తారు. అనంతరం ఛార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో కేంద్రమంత్రులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ కార్యక్రమంలో 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.
