కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధిని చావు దెబ్బతీసింది. సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలు జుడీషియల్ కమిషన్‌కు ఉన్నాయి. మొత్తం ప్రాజెక్టుపై సమగ్ర న్యాయవిచారణ జరిపించాలి. తప్పుల తడక డిజైన్లకు ఎలా అనుమతిచ్చారు. ఇరిగేషన్ అంటేనే మాఫియాగా మారింది’ అని పలువురు వక్తలు ఆరోపించారు. ‘జుడీషియల్ కమిషన్‌లను బెదిరించే కేసీఆర్ భూస్వామ్య రాచరిక విధానాలను ఖండించండి, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపించండి’ అంటూ తెలంగాణ జలసాధన సమితి, తెలంగాణ రైతుసంక్షేమ సమితిల ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ లో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.
తెలంగాణ అభివృద్ధిని ‘కాళేశ్వరం’ చావు దెబ్బతీసింది..
