మోస్ట్ స్టానింగ్, హాట్ బ్యూటీస్ నటించిన మూవీస్ అన్ని ఈ వారం విడుదల కావడంతో ఇక అన్ లిమిలెట్ ఎంటర్టైన్మెంటే ఆగస్టు 15 న టాలీవుడ్ లో దాదాపు మూడు సినిమాలతో పాటు ఒక సినిమా ప్రీమియర్స్ విడుదల కాకున్నది. అందులో డబుల్ ఇస్మార్ట్ , మిస్టర్ బచ్చన్ అనే సినిమాలతో పాటు తంగలాన్ అనే డబ్బింగ్ సినిమా కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నది. మరోసటి రోజు ఆగస్ట్ 16న ఆయ్ అనే సినిమా ప్రీమియర్ ప్రదర్శించేందుకు సిద్ధమవుతుంది. ఇందులో ప్రధానంగా ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ వెయిటెడ్ పాన్ ఇండియా ‘డబుల్ ఇస్మార్ట్’. గతంలో వీరిద్దరి కాంబో వచ్చిన సూపర్ బూపర్ హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్ గా ఈ మూవీ వస్తుంది. మరో మూవీ మిస్టర్ బచ్చన్ ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తుండగా.. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ మాస్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేశాయి.
ఇండిపెండెన్స్ డే వీక్ లో తెలుగు తెరపై హాట్ హీరోయిన్స్ మసాల మూవీస్..
