బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించిన మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ తరగతి గదిలో విద్యార్థి అరుణ్ (19) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ తదితర విద్యార్థి సంఘాలు కళాశాల వద్ద నిరసన తెలిపాయి. తరగతులు నుంచి బయటకు వచ్చి విద్యార్థులు కూడా కళాశాల వద్దకు చేరుకున్నారు. మరోవైపు మృతుని బంధువులు, విద్యార్థులు యూనివర్సిటీ లోపల ఉన్న ఫర్నిచర్ తో పాటు అద్దాలను ధ్వంసం చేశారు. ఫర్నిచర్ ని బయట వేసి తగలబెట్టారు. చనిపోయిన విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్శిటీ వద్ద ఉద్రిక్తత..
