రామాలయం రథానికి నిప్పు.. 

rama-24-.jpg

అనంతపురం జిల్లా కనేకల్‌ మండలం హనకనహాల్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీరామాలయం రథానికి గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి నిప్పుపెట్టారు. దీంతో స్థానికులు మంటలార్పారు. పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక సీసీ ఫుటేజులను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో రథం సగానికి పైగా దగ్ధమైంది. అయితే ఘటనాస్థలం వద్ద బీజేపీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. రథానికి నిప్పు పెట్టిన దుండగలను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Share this post

scroll to top