తిరుపతిలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. టెన్త్ క్లాస్ చదువుతున్న బాలికపై అత్యాచారం జరిగింది. వివరాల్లోకి వెళితే యలమందలో స్కూల్ ముగించుకొని ఒంటరిగా ఇంటికి వెళ్తున్న బాలికను కొందరు గుర్తు తెలియని దుండగులు అడ్డగించారు. ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి బాలికపై అతి క్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. గాయాలతో పడి ఉన్న బాలికను స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా వరుస అత్యాచార ఘటనలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. ఇటీవల తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో చిన్నారి హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో ఘటన తిరుపతిలోనే చోటుచేసుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది.
రాష్ట్రంలో మరో దారుణం..
