ఆరు నెలల టైం ఇవ్వాలనుకున్నా..

kcr-25.jpg

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ 2024-25పై బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ బడ్జెట్‌ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని ఫైరయ్యారు. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత సభ వాయిదా పడగా.. అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని పొగిడినట్లే పొగిడి అన్నదాతను వెన్నుపోటు పొడిచారన్నారు. ఇందులో చెప్పుకోవటానికి కొత్తగా ఏమీ లేదన్నారు.కాంగ్రెస్ రైతు శుత్రు ప్రభుత్వంగా మారిందని ఫైరయ్యారు. రైతు బంధును ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. గొర్రెల పంపిణీ పథకంపై ఎలాంటి ప్రస్తావన లేదని.. దళితుల స్వాలంబన కోసం తీసుకొచ్చిన దళిత బంధు పథకానికి సైతం మంగళం పాడారన్నారు. ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇవ్వాలనుకున్నా.. వారి చర్యలు చూశాక ఇక రంగంలోకి దిగాల్సిందేనని నిర్ణయించుకున్నామన్నారు.

Share this post

scroll to top