మరికొద్దిసేపట్లోనే మోగనున్న మొబైల్ ఫోన్లు..

ravanth-15.jpg

రైతుల రుణమాఫీకి సంబంధించి మూడో విడత అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణం పొందిన రైతులను రుణవిముక్తులను చేయడానికి నిధులు సమకూర్చింది. ఈ కేటగిరీలో సుమారు 6 లక్షల మంది రైతులు ఉండగా.. వీరికి రుణమాఫీ చేసేందుకు సుమారు రూ.6 వేల కోట్లు అవసరమవుతున్నాయి. ఇందుకోసం ఆర్‌బీఐ నిర్వహించిన ఈ-వేలం ద్వారా ప్రభుత్వం గతవారం రూ.3 వేల కోట్లు, మంగళవారం మరో రూ.3 వేల కోట్లు కలిపి రూ.6 వేల కోట్లను రుణంగా తీసుకుంది. ఈ మొత్తాన్ని మూడో విడత రుణమాఫీకి వినియోగించనుంది.

Share this post

scroll to top