రాకేష్ రెడ్డికి TGPSC పరువునష్టం నోటీసులు..

kowshik-reddy-12-.jpg

బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డిపై టీజీపీఎస్సీ పరువునష్టం దావా వేయడంతో పాటు స్పందించాలని నోటీసులు జారీ చేసింది. గ్రూప్-1 ఫలితాల విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డికి TGPSC పరువునష్టం దావా నోటీసులు పంపించింది. వారం రోజుల్లో సమాధానం ఇచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. వారం రోజుల్లో సమాధానం చెప్పనట్లైతే పరువునష్టం కేసులు, ఇతర క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని హెచ్చరించింది. ఇంకెప్పుడు TGPSCపై రాకేష్ రెడ్డి ఎటువంటి ఆరోపణలు చేయొద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టద్దని ఆంక్షలు విధిస్తూ నోటీసుల్లో పేర్కొంది.

Share this post

scroll to top