టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించే పురుషులు సీట్లు దొరక్క అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా కండక్టర్లు టికెట్లు ఇచ్చే సమయంలో ప్రయాణికులు ఇస్తున్న పెద్ద నోట్లతో సమస్య తలెత్తుతోంది. మరోవైపు అందరూ చిల్లర లేకుండానే బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో చేసేదేమి లేక కండక్టర్లు వారికి టికెట్లు ఇచ్చి ఆ టికెట్ వెనకాలే తిరిగి ఇచ్చే డబ్బులు రాసి ఇస్తున్నారు.
ఈ పరిణామంతో ప్రయాణికులు, కండక్టర్లకు మధ్య నిత్యం పంచాయితీలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇక మీదట ఆ సమస్యల చెక్ పెడుతూ.. టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్‌ను అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇప్పటికే బండ్లగూడ దిల్‌సుఖ్‌నగర్ డిపోల్లో పైలెట్ ప్రాజెక్టుగా డిజిటల్ పేమెంట్స్‌ను అమలు చేయగా.. ఆ ప్రయోగం విజయవంతమైంది. ఇక ఫోన్ పే, గూగుల్ పే, స్కాన్ సిస్టమ్, క్రెడిట్, డెబిట్ కార్డులతో అన్ని రకాల డిజిటల్ పెమెంట్స్‌ను ఆర్టీసీ బస్సుల్లో అనుమతించాలని ఆర్టీసీ ఎండీ సూచనాప్రాయంగా చెప్పినట్లుగా సమాచారం. ప్రస్తుతం కండక్టర్లు వాడుతున్న టిమ్ మిషన్ల స్థానంలో రాష్ట్రం వ్యాప్తంగా కండక్టర్లకు ఆటోమెటిక్ ఫెయిర్ కలెక్షన్ సిస్టమ్ మిషన్లను ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది.