దళపతి విజయ్ కి అరుదైన ఘనత..

vijay-4.jpg

సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన స్టైల్ కు సెలబ్రిటీలే ఫ్యాన్స్ గా మారుతుంటారు. ఇక తమిళంలో రజినీ తర్వాత మళ్లీ అంతటి ఫాలోయింగ్ ఉన్నది దళపతి విజయ్ కే. ఇక విజయ్ నటించిన ‘ది గోట్’ మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. దళపతి మూవీ వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పెద్ద పండగే. తమిళంలో అయితే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ది గోట్ మూవీతో ఆ ఘనత సాధించిన హీరోగా విజయ్ నిలవనున్నాడు.

దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ ‘ది గోట్’. స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ పార్కింగ్ కంపెనీ తమ ఉద్యోగులకు ది గోట్ విడుదల సందర్భంగా సెలవు ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. విజయ్ పై ఉన్న ప్రత్యేక అభిమానానికి, మా ఉద్యోగుల్లో ఉన్న ఉత్సాహానికి గుర్తుగా ది గోట్ మూవీ రిలీజ్ సందర్భంగా కంపెనీ ఉద్యోగులకు సెలవు ప్రకటిస్తున్నాం. అలాగే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావాలని ఆకాంక్షిస్తున్నాం. అలాగే ఉద్యోగులకు కాంప్లిమెంటరీ టికెట్లను అందించబోతున్నాం” అని పార్క్విక్ సీఈవో అరుణ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశాడు.

Share this post

scroll to top