OG నుంచి అదిరిపోయే అప్డేట్..

og-pavan-kalyan-18.jpg

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఓజీ ప్రియాంకా ఆరుళ్ మోహ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో శ్రియా రెడ్డి కీల‌క పాత్రలో అలరించనుంది. కాగా త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఎన్నికల కారణంగా గతేడాది ఈ మూవీ చిత్రీకరణ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ త‌రువాత ఓజీ టీమ్ షూటింగ్ మూడ్‌లోకి వ‌చ్చేసింది. బ్యాక్ టు ఓజీ అంటూ సినిమాటోగ్రాఫ‌ర్ ర‌వి కే చంద్రన్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక షూట్ లొకేష‌న్‌ లో సినిమాటోగ్రాఫ‌ర్ ర‌వి కే చంద్రన్, సుజిత్‌, త‌మ‌న్ వ‌ర్కింగ్‌ లో ఉన్న పిక్స్‌ ను చిత్ర బృందం సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. బాయ్స్‌ అంద‌రూ ఫైర్ మీద ఉన్నారు అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Share this post

scroll to top