కడప మున్సిపల్ స్కూలు విద్యార్థులతో పవన్.. 

pavan-kalyan-7.jpg

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ప్రభుత్వం ఆత్మీయ సమావేశం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహింస్తోంది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కడప మున్సిపల్ స్కూలు విద్యార్థులను కలిశారు. విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడారు. స్కూలులో ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు. టీచర్ల టైముకు వస్తున్నారా, చదువులు ఎలా చెబుతున్నారు అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనంపైనా ఆరా తీశారు. ఇంకా ఎలాంటి సౌకర్యాలు, వసతులు కావాలని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు పవన్ కల్యాణ్ ఆటోట్రాఫ్‌ను తీసుకున్నారు. విద్యార్థులందరూ బాగా చదువుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. చదువు విషయంలో ఎలాంటి సందేశాలు వచ్చినా టీచర్లను అడిగి తెలుసుకోవాలని, బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు పవన్ సూచించారు.

Share this post

scroll to top