రాష్ట్ర కేబినెట్ కాసేపట్లో సమావేశం కానుంది. సబ్ కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలపనుంది. అమరావతి రీ-లాంచ్ ప్రాజెక్టులతో పాటు పలు కంపెనీలకు స్థలాల కేటాయింపుపై మంత్రులు చర్చించనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరగనుంది. అనంతరం 47వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కార్యక్రమాలపైనా చర్చించనున్నారు. ఆపరేషన్ సింధూర్ తోపాటు రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నందన ప్రధాని మోదీకి కేబినెట్ ధన్యవాదాలు తెలపనుంది. దేశ సరిహద్దులో యుద్ధ వాతావరణంపై సమాలోచనలు చేయనున్నారు. తీరప్రాంత భద్రతపైనా కేబినెట్ ప్రత్యేకంగా చర్చించనుంది.
నేడు ఏపీ క్యాబినెట్ భేటీ యుద్ధ వాతావరణం పై చర్చ..
