విజయవాడలో వెనక్కి నడుస్తూ వాలంటీర్ల ధర్నా..

volunter-04.jpg

వాలంటీర్ల పోరాటం ఉధృతమవుతోంది. గత ప్రభుత్వంలో నియామకైన వాలంటీర్లు ప్రజలకు ఇంటివద్దనే సేవలు అందించారు. ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకే అందజేశారు. అయితే వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. అయితే టీడీపీ నేతలు చేసిన విమర్శలను నిరసిస్తూ 2024 సాధారణ ఎన్నికలకు ముందు పలువురు వాలంటీర్లు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేతలు చెప్పడంతో ఒకేసారి రాజీనామాలు చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి.

అయితే తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ప్రాధాన్యత ఇస్తామని, వేతనాన్ని కూడా పెంచుతామని కూటమి నాయకులు హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల సేవలను వినియోగించుకోలేదు. పింఛన్లు లబ్ధిదారులకు సచివాలయ ఉద్యోగులే ఇంటి వద్దకు తీసుకెళ్లి అందజేస్తున్నారు. దీంతో వాలంటీర్లు ఆందోళనకు దిగారు. కూటమి నాయకులు తమకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మూడు రోజుల పాటు నిరసనకు పిలుపు నిచ్చారు.

Share this post

scroll to top