ఓటుకు నోటు కేసుతో బంధం.. ఊహించనిరీతిలో అందలం ఆ కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు కేసులో ఈ ఇద్దరికీ సాయం చేసిన వారికి ఇప్పుడు పెద్ద స్థాయిలో పదవులు మీ అస్మదీయులకే పదవులా? సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు చంద్రబాబు, రేవంత్ రెడ్డి? రాష్ట్రంలో నిరుద్యోగులకు మొండిచేయి చూపుతున్న రేవంత్ సర్కార్.. అస్మదీయులకు మాత్రం పదవులను కట్టబెడుతూనే ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుతో సంబంధం ఉన్న వారందరికీ జాబ్ గ్యారంటీ అంటూ ఒక్కో పదవిలో కూర్చోబెడుతున్నారు. తాజాగా ఆ కేసులో డబ్బు సంచులతో కెమేరా కంటికి చిక్కిన సీఎం రేవంత్ ముఖ్య అనుచరుడు రుద్ర ఉదయ సింహాకు ఢిల్లీలో ఓ పదవి ఇచ్చారు. దీంతో ఓటుకు నోటు కేసులోని నిందితులపై చర్చ మొదలైంది. రాజ్యం మనదైతే కొలువులు కూడా మనవే అన్నట్టుగా అందరికీ ఒక్కో పదవి ఇచ్చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఓటుకు నోటు కేసుతో బంధం.. ఊహించనిరీతిలో అందలం…
