కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అభివృద్ది కాంక్షను పక్కనబెట్టి, రాజకీయ కక్షతో ముందుకు వెళ్లడం గర్హనీయమని విమర్శించారు. రేవంత్ రెడ్డి దివాళాకోరు రాజకీయాలకు ఇది పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 33 జిల్లాల్లో మంజూరైన సుమారు రూ.10 వేల కోట్ల విలువ చేసే 34,511 పనులను రద్దు చేయడమే దీనికి నిదర్శనమన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఈ వివరాలను బయటపెట్టిందంటూ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న రేవంత్ సర్కార్..
