మూడున్నరేళ్ల బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి..

medhak-12.jpg

మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్‌ జిల్లాకు చెందిన మూడున్నరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ ఆటో డ్రైవర్. పిల్లికొట్టాల్ లో పలు మార్లు చిన్నారికి చాక్లెట్లు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు అబ్బాస్. అయితే తాజాగా మూడున్నరేళ్ల బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ సంఘటన పోలీసులకు ఫిర్యాదు చేసారు తల్లిదండ్రలు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితున్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఫోక్స్‌ చట్టం కింద కేసు నమోదు చేసి బాలికపై లైంగిక దాడి చేసిన ఆటో డ్రైవర్ ను బొక్కలో వేశారు పోలీసులు.

Share this post

scroll to top