ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముద్దుల మనువడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యలు శ్రీవారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో దేవాన్ష్ పేరు మీద ఇవాళ అన్నదానం చేయనున్నారు. వచ్చిన భక్తులకు నేరుగా సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులు వారికి అన్న ప్రసాదాలను వడ్డించనున్నారు. అన్నదాన కార్యక్రమం ముగియగానే మధ్యాహ్నం 2 గంటలకు సీఎం చంద్రబాబు తిరుమల నుంచి బయలుదేరి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. అంతకు ముందు సీఎంకు ఆలయ మహాద్వారం వద్ద అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయన వెంట టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామల రావు, తదితరులు ఉన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు, లోకేష్, కుటుంబ సభ్యులు..
