చంద్రబాబు ఒక కన్ను ను తీసేశారా..

mla-22-.jpg

తెలంగాణ సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు, ప్రజాప్రతినిధులపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీ నేతలు మా దగ్గరికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటే మేము ఒక్కమాట అనలేదు. మీరు తెలంగాణకు రావొద్దని, అసెంబ్లీలో బాయ్‌కాట్‌ అనే నిర్ణయం తీసుకుంటే మీరే బాధపడతారు.’ అంటూ హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబును ఒక్కటే అడుగుతున్నాం.. మీరు విభజన సమయంలో ఒక కన్ను తెలంగాణ .. ఒక కన్ను ఆంధ్రా అని చెప్పారు. మరి ఈ రోజు ఒక కన్నును తీసేశారా? మీ ఎమ్మెల్యేలు, నేతలు యాదాద్రి, భద్రాచలం వచ్చి ఈవోలకు ఫోన్లు చేస్తే గౌరవమర్యాదలిస్తున్నారు. ఇక్కడ మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు.’ అని మండిపడ్డారు. సోమవారం ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు.

Share this post

scroll to top