కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఆయన ఇటీవల నటించిన లాల్ సలామ్ సినిమా విజయం అందుకోలేనప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు. ఆయన తొందరలోనే వెట్టైయాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో కూలీ మూవీ చేస్తున్నాడు. సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిది మారన్ నిర్మిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా, కూలీ సినిమా మేకర్స్ అప్డేట్ విడుదల చేసి అంచనాలను పెంచేశారు. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున సైమన్ పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేయడంతో అది కాస్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అందులో నాగార్జున స్టైలిష్ లుక్‌తో కూర్చీలో కూర్చుని చేతికి వాచ్ పెట్టకుని ఉండగా మరో చేతిలో రెడ్ కలర్ క్లాత్ ఉంది. ప్రజెంట్ నాగ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు తలైవా, బ్లాస్ట్ చేస్తారు అని కామెంట్స్ పెడుతున్నారు.