ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో టమోటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. నెలన్నర క్రితం వరకు కిలో 20 నుంచి 30 రూపాయలు పలికిన టమాటా ధర ఇప్పుడు భారీగా పెరిగింది. గత పదిహేను రోజుల్లో టమాటా ధర డబుల్ అయింది. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్‌లో కిలో టమాటా 70 నుంచి 80 రూపాయలు పలుకుతోంది. రిటైల్ అయితే 100 దాటింది. డిమాండ్‌కు సరిపడ టమాటా రాకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు కూరగాయల వ్యాపారులు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు టమాటా పంటలు దెబ్బతిన్నాయని దీంతో ధరలు అమాంతం పెరిగాయని చెబుతున్నారు వ్యాపారులు. హైదరాబాద్‌కు తెలంగాణలోని జిల్లాల నుంచే కాకుండా రాయలసీమ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా టమాటా వస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి పంట రాక తగ్గడంతో పాటు రాష్ట్రంలో దిగుబడి తగ్గటంతో ధరలు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.
భారీగా పెరిగిన టమాటా ధరలు..
