నగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న వాహనాల రద్దీని తగ్గించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సర్వీస్ రోడ్లను అభివృద్ది చేస్తున్నారు. త్వరలో సైబర్టవర్స్ ఫ్లై ఓవర్ ల్యాండింగ్ పాయింట్ నుంచి జేఎన్టీయూ రూట్లో యశోదా హాస్పిటల్ వరకు సర్వీస్రోడ్డును నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పనుల కారణంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ఈ నెల 14 నుంచి 30వరకు వాహనాల రూట్ మళ్లింపు అమలులో ఉంటుందని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ తెలిపారు. సైబర్ టవర్స్, 100 ఫీట్రోడ్డు, కొత్తగూడ జంక్షన్వైపు నుంచి జేఎన్టీయూ, మూసాపేట వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు.
ఆ రూట్లలో 15 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు..
