ప్రస్తుతం ఎక్కడ చూసినా యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నగదు రహిత లావాదేవీలకు ఫుల్ డిమాండ్ ఉంది. యూపీఐ పేమెంట్స్ యాప్స్ అందుబాటులోకి రావడంతో టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద షోరూమ్‌ల వరకు అన్నిచోట డిజిటల్ చెల్లింపులు కామన్‌గా మారాయి. అయితే బస్సుల్లో మాత్రం ఇలాంటి సేవలు ఇప్పటి వరకు అందుబాటులో లేవనే చెప్పాలి. దీంతో ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్యగా మారుతోంది. మరీముఖ్యంగా తెలంగాణలో మహా లక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో పురుషులకు చిల్లర సమస్య మరింత ఎక్కువైంది. ఈ సమస్యకు పరిష్కారం చూపించే దిశగా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పల్లె బస్సులతో పాటు, సిటీ బస్సుల్లోనూ నగదు రహిత డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఆగస్టు నాటికి సిటీ సర్వీసుల్లో, సెప్టెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ సేవలను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ సమస్యకు చెక్
