టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చే­శారు..

ttd-10.jpg

టీటీడీని సీఎం చంద్రబాబు పూర్తిగా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చే­శారు. అత్యంత వివాదాస్పదులు, తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నవారికి టీటీడీ పాలక మండలిలో స్థానం కల్పించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమలలో దళారుల దందాకు తలుపులు బార్లా తెరిచారు. ఎన్నికల్లో తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మభ్యపెట్టి టీడీపీకి  బాకా ఊదిన టీవీ 5 చానల్‌ చైర్మన్‌ బీఆర్‌ నాయుడును టీటీడీ చైర్మన్‌గా నియమించారు. 

టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి రాజ్యాంగం పట్ల గౌరవం లేదు దేవుడి పట్ల భక్తి లేదు. సివిల్‌ సర్వెంట్‌గా పాటించాల్సిన నిబంధనల పట్ల పట్టింపు లేదు. ఉన్నదల్లా కులం దాని నుంచి వచ్చిన బలం! అంతకు మించి ఏ కోశా­నా సమర్థత, నిజాయితీ, ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలన్న ఇంగితం లేవు. వెంకయ్య చౌదరి భక్తులను పురుగుల్లా చూస్తూ ఇప్పుడు ఆరుగురి ప్రాణాలు బలిగొనడానికి కారణమయ్యా­రు. 

Share this post

scroll to top