కేంద్ర ప్రభుత్వ రోజ్ గార్ మేళా..

kishan-reddy-29.jpg

కేంద్ర ప్రభుత్వ రోజ్‌గార్‌ మేళాలో భాగంగా నేడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలను ప్రధాని, కేంద్ర మంత్రులు నేడు అందజేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 51 వేల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో 155 మందికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. 10 విభాగాల్లో ఉద్యోగాలు ఉండగా ఒక్క పోస్టల్ డిపార్ట్ మెంట్‌లోనే 119 మందికి నియామక పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారత్ చేరుకుందన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా తయారు కావడానికి యువశక్తిని వినియోగించుకోవడం అవసరమన్నారు. 2047 వరకు వికసిత భారత్ కోసం శక్తి సామర్థ్యాలు సమకూర్చుకోవాలన్నారు. అనేక కంపెనీలకు మన వాళ్ళు సీఈఓలుగా ఉన్నారని తెలిపారు. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చాం మాతృ భాషలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఏది కనుగొన్నా దానిలో భారతీయుల మేధస్సు ఉందని తెలిపారు. 75 దేశాలకు డిఫెన్స్ పరికరాలు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నామని చెప్పారు.

Share this post

scroll to top