టీడీపీ నేత, కాపు నాయకుడు వంగవీటి రాధాకృష్ణకు ఇవాళ తెల్లవారుజామున స్వల్ప గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వంగవీటి రాధాకృష్ణ ఉదయం ఇంట్లో ఉన్న సమయంలోనే గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. వంగవీటి రాధాకృష్ణకు గుండెపోటు రావడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రికి అభిమానులు తరలివెళ్తున్నారు.
వంగవీటి రాధాకృష్ణకు స్వల్ప గుండెపోటు..
