రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాలకు గొంతెత్తే స్వాతంత్రం కూడా లేకుండా చేశారంటూ మాజీ మంత్రి విడదల రజని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నిత్యం దళితులు, వెనుకబడిన వర్గాలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుని పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్లో నరసరావుపేట జైలులో రిమాండ్‌లో ఉన్న చిలకలూరిపేటకు చెందిన దళిత యువకుడు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ దొడ్డా రాకేష్ గాంధీని సోమవారం ఆమె పరామర్శించి, ధైర్యం చెప్పారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివీస్ట్ లపై ఉక్కుపాదంతో అణిచివేస్తున్న దుర్మార్గమైన పాలనను చంద్రబాబు కొనసాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో గొంతెత్తే స్వాతంత్రం కూడా లేదు..
