జేఎన్‌టీయూలో పరిస్థితి ఇదీ..

hostal-17.jpg

జేఎన్‌టీయూ కళాశాల మంజీరా వసతిగృహం క్యాంటీన్లోని ఆహార పదార్థాల గిన్నెల్లో పిల్లి మూతి పెట్టిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో గ్రేటర్‌ ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్రమత్తమయ్యారు. వసతిగృహంలోని వంటగది, నిత్యావసరాల స్టోర్‌ రూమ్‌లను తనిఖీ చేశారు. వంటగది, కూరగాయలు నిల్వ ఉంచే ప్రాంతాన్ని పరిశీలించారు. అపరిశుభ్రంగా నీరు నిలిచి ఉండడాన్ని గమనించి పలు సూచనలు చేశారు. కొన్ని కూరగాయలు పాడైపోవడంతో సిబ్బందిని మందలించి పారబోయించారు. వంటపాత్రలపై మూతలు, కిటికీలకు మెష్‌లు లేవని..వాటిని అమర్చాలన్నారు. కేర్‌టేకర్లు మెస్‌లో 24గంటలూ ఉండాలన్నారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించిన తర్వాత వారి ఆదేశాలకు అనుగుణంగా చర్యలుంటాయని తెలిపారు. ఓ పిల్లి పెరుగు తాగిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రెండ్రోజులు క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీంతోపాటు యూనివర్సిటీ క్యాంటీన్లలో విద్యార్థులకు పెట్టే ఆహారంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందోనని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Share this post

scroll to top