వరద బాధితులకు నష్టరిహారం గురువారం నుంచి పంపిణీ చేయబడుతుందన్నారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్ని విజయవాడలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం ఇంటింటా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ పశ్చిమ నియోజకవర్గంలోని 56వ డివిజన్ ఓల్డ్ ఆర్.ఆర్. పేటలో ఇది మంచి ప్రభుత్వం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం వందరోజుల పాలనలో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటా తిరిగి విస్తృతంగా ప్రజలకు వివరించారు ఎంపీ కేశినేని శివనాథ్ ఇక, ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వల్లే విజయవాడ వరద విపత్తు నుంచి బయట పడగలిగిందన్నారు. వరద బాధితులకు నష్టరిహారం గురువారం నుంచి పంపిణీ చేయబడుతుందన్నారు. అయితే, వైఎస్ జగన్ బురద రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాసిన ఉత్తరంలో వైఎస్ జగన్ టీటీడీ లడ్డూ కల్తీ విషయంలో సీబీఐ విచారణ ఎందుకు కోరలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ విజయవాడ లోక్‌సభ సభ్యులు కేశినేని శివనాథ్.
వరద బాధితులకు నష్టరిహారం..
