దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి నుంచి ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ‘SSMB29’. ‘RRR’ లాంటి పాన్ ఇండియా హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో దేశ వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. దీనిపై రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు. ‘మాస్టర్ క్లాస్ బై మిస్టర్ విజయేంద్ర ప్రసాద్’ అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన. ‘SSMB29’ షూటింగ్ గురించి మాట్లాడారు. జనవరి నుంచి మహేశ్ – రాజమౌళి మూవీ షూట్ ప్రారంభం కానుందని చెప్పారు. ఈ కథ రాయడానికి దాదాపు రెండేళ్లు టైమ్ పట్టిందన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన విజయేంద్ర ప్రసాద్..
