స్టీల్ ప్లాంట్ పై ఢిల్లీ కీలక నిర్ణయం..

vizag-24-.jpg

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ దిశగానే కేంద్రం అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. తాజాగా ప్లాంట్ ఉద్యోగుల వీఆర్ఎస్ కోసం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సంఖ్యను తగ్గించే లక్ష్యంతో ప్లాంట్ లోని హెచ్ఆర్ విభాగం కీలక సర్క్యులర్ జారీ చేసింది. ప్లాంట్ ప్రయివేటీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తాము ఆందోళన చేస్తున్న సమయంలో ఈ రకంగా సర్క్యులర్ జారీ చేయటం పైన ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్క్యులర్‌లో సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నప్పటికీ కార్మికులు, ఉద్యోగుల్లో అనేక రకాలైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఉద్యోగుల్లో ఆందోళన ఉద్యోగుల పోర్టల్‌ సపోర్ట్‌ సిస్టమ్‌లో ‘సర్వే ఫర్‌ విఆర్‌ఎస్‌’ పేరుతో ఒక మాడ్యుల్‌ను రూపొందించి నట్లు సర్క్యులర్‌లో యాజమాన్యం పేర్కొంది. భాగస్వాములు అయ్యే వారి అభిప్రాయాలను తీసుకునేందుకు సర్వేలను నిర్వహించారు. సర్వేల్లో అవును, కాదు అని సమాధానం వచ్చేలా ప్రశ్నలు ఉంటాయి. అయితే, ఉక్కు యాజమాన్యం జారీ చేసిన సర్క్యులర్‌లో దీనికి భిన్నంగా అర్హులైన ఉద్యోగులు విఆర్‌ఎస్‌కు ఈ మాడ్యుల్‌ ద్వారా ‘అంగీకారం తెలపాలని పేర్కొనడం కలకలం రేపుతోంది.

Share this post

scroll to top