తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తురాలు తీవ్రంగా గాయపడింది. తిరుమల కొండపై ఉన్న జపాలి తీర్థంలో ఆంజనేయ స్వామి దర్శనం కోసం వెళ్లున్న ఓ యువతిపై ఒక్కసారిగా చెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని హుటాహుటీన ఆసుపత్రికి తీసుకెళ్లగా.. తల, వెన్నెముకకు తీవ్రగాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. తిరుమల జపాలి తీర్థంలో చెట్టు కొమ్ము విరిగి భక్తుల మీద పడింది. ఈ ప్రమాదంలో ఓ భక్తురాలు తీవ్రంగా గాయపడింది. జపాలీతీర్థం గుడి ముందు వెళుతున్న భక్తులపై చెట్టు కొమ్ము వర్షానికి తడిచి పడి పోయింది. అదే సమయంలో జపాలిలోని ఆంజనేయ స్వామిని స్మరిస్తూ ముందుకు కదులుతున్న మహిళ వీపు భాగంపై చెట్టు కొమ్మ పడింది. దీంతో ఒక్కసారిగా అక్కడికక్కడే ఆమె నేలపై కుప్పకూలింది. చెట్టు కొమ్ము విరిగి పడటంతో తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని బెంగళూరుకు చెందిన 55 ఏళ్ల ఉమాదేవిగా గుర్తించారు.
తిరుమలలో షాకింగ్ ఘటన.. దర్శనానికి వస్తే భక్తురాలి నడుం విరిగింది!
