వాయనాడ్ ముండకై కొండచరియలు విరిగిపడటంతో అక్కడి జనజీవనం అస్తవ్యస్థమైంది. వాయనాడ్‌లోని ముండకై, చురల్‌మలలోమంగళవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 151కి చేరింది. 211 మంది తప్పిపోయిన వారి జాబితాలో ఉన్నారు. కేరళను కుదిపేసిన అతిపెద్ద ప్రమాదంగా ఈఘటన నిలిచింది. కొండచరియల కింద పడిన అనేక మందిని సహాయక బృందాలు రక్షించగా.. 191 మందికి పైగా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అనేక కుటుంబాలు ఒంటరిగా ఉన్నాయి. భారీ రెస్క్యూ మిషన్ నిన్న అర్థరాత్రి వరకు కొనసాగింది.తిరిగి బుధవారం ఉదయం నుండి మళ్లీ సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంకా ఆచూకీ లభించని వారిలో టీ, కాఫీ తోటల్లో పని చేసే కార్మికులతో పాటు వారి కుటుంబాలు ఉన్నాయి. విపత్తు సంభవించినప్పుడు తమ కుటీరాల్లో నిద్రిస్తున్న పశ్చిమ బెంగాల్, అస్సాం నుండి వలస వచ్చిన కార్మికులు కూడా తప్పిపోయిన వారిలో ఉన్నారు.వీరి సంఖ్య సుమారు 500మందికిపైగా ఉండవచ్చని తెలుస్తోంది.
మృతుల సంఖ్య అంతకంతు పెరుగుతోంది..
