రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లోకొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ పలు జిల్లాలకు అలెర్ట్‌ను జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 35.5 డిగ్రీలు నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రతలు 25. 5 డిగ్రీలుగా ఉంది. కానీ, కొన్ని చోట్ల అక్కడకక్కడ వానలు పడే అవకాశాలున్నాయని వాతారణశాఖ అధికారులు తెలిపారు. అలాగే ఏపీలోని విజయవాడలో గరిష్ట ఉష్ణోగ్రతలు 37.5 డిగ్రీలుగా నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలుగా ఉందని దీంతో, అక్కడక్కడ చిరు జల్లులు పడతాయని అధికారులు తెలిపారు
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక..
